హై బీపీ నివారణకు లోరుండ్రోస్టాట్ అనే కొత్త మందును సైంటిస్టులు రూపొందిస్తున్నారు. ఇది ఆల్డోస్టిరాన్ ఉత్పత్తి తగ్గించి, బీపీని అదుపులో ఉంచుతుందని వారు తెలిపారు. ప్రయోగ పరీక్షల్లో సమర్థంగా పనిచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రక్తపోటు నివారణకు థియాజైడ్, క్యాల్షియం ఛానెల్ బ్లాకర్, యాంజియోటెన్సిన్ లాంటి మందులను వినియోగిస్తున్నారు. వీటితో కొన్ని దుష్ప్రభావాలు ఉండగా, కొత్త మందుతో ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.