కొత్తిమీర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందంట. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-ఏ, సీ, యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంట. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుందని, రక్త ప్రసరణ పెంచడంతో పాటు బీపీ కారణమయ్యే సోడియాన్ని బయటకు పంపుతుందని నిపుణులు చెబుతున్నారు.