జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూరితయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో కచ్చితంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాల్లో పురోగతి కనిపించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాల పెండింగ్ పనులు, జలాజీవన్ మిషన్ పనులను వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.