మహిళలు బాగుంటే కుటుంబాలు తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభిప్రాయపడ్డారు. బుధవారం ఆర్డీటి, జిల్లా పోలీసుశాఖ మరియు కొందరు దాతల సహకారంతో స్థానిక షికారీ కాలనీలోని 55 కుటుంబాలకు వివిధ రకాలుగా సాయం అందించారు. జిల్లా ఎస్పీ, ఆర్డీటి విశాల ఫెర్రర్ లు 14 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వీల్ ఛేయిర్లు, కృత్రిమ అవయవాలు, వాకింగ్ స్టిక్స్ లను అందజేశారు.