డ్రైఫ్రూట్స్‌లో బాదం ప్రత్యేకమైనది. ఇది తినడానికి టేస్ట్‌గా ఉండటంతోపాటు తక్షణ శక్తిని, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, కొందరు ఆరోగ్యానికి బాదం మేలు చేస్తుందని అతిగా తింటూంటారు. బాదం అతిగా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తింటే శరీరంలో విటమిన్ E మోతాదులు పెరిగి విషంగా మారుతాయి. దాంతో పాటు బరువు పెరుగుతారని, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయని తెలిపారు.