మేషం: ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. కొన్ని వ్యవవహారలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభం: నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
మిధునం: చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహ కలుగుతుంది. ధనపరంగా అనుకూలత పెరుగుతుంది.
కర్కాటకం: చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు.
సింహం: రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.
కన్య: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
తుల: సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.
వృశ్చికం: కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనస్సు: ఆధాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానలు ఆశ్చర్య పరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
మకరం: సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైనా ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు.
కుంభం: వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.
మీనం: నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.