డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం, జీడిపప్పు తింటే శరీరానికి శక్తిని చేకూరుస్తుంది. అయితే చాలా మందికి తెలియని డ్రై ఫ్రూట్ ఉంది. అదే చిల్గోజా. ఇందులో జీడిపప్పు, బాదం కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరానికి బలాన్ని చూకూరుస్తాయి. బలహీనతను తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.