పానీపూరి తిని 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 40 మంది పిల్లలు, 10 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో చోటు చేసుకుంది. గోసైన్ తోలా ప్రాంతంలో ఉన్న పానీపూరి బండి వద్ద పిల్లలు, మహిళలు పానీపూరి తిన్నారు. అనంతరం వారు అస్వస్థతకు గురయ్యారు. వారికి చికిత్స నిమిత్తం కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు.