ఆత్మకూరు మండలంలోని పి కొత్తపల్లి, దొడ్డే కొట్టాల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా బాబుతో నేను కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం కక్ష సాధింపుతో కేసులు పెట్టి జైలుకు పంపిందని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.