కొందరు అధిక బరువుతో ఇబ్బందులు పడుతుంటారు. బరువు తగ్గేందుకు ప్రయత్నించినా ఫలితం లేదంటే, ప్రయత్నాల్లో లోపం ఉన్నట్లే. వాటిని గ్రహించి మెలకువలు పాటిస్తే వెయిట్ తగ్గటం పెద్ద సమస్యేం కాదు. ఈ మేరకు సరైన ప్లానింగ్ ఉండాలి. దాంట్లో మొదటిది ఆహారంలో ఎటువంటి ఫ్యాటీ ఫుడ్ ఉండకుండా చూసుకోవడం. కూరగాయలు, పండ్లు, స్నాక్స్ తీసుకునే విధానంలో ముందస్తు ప్లాన్ చేసుకోవాలి. ఐస్క్రీమ్లు, పిండిపదార్థాలకు దూరంగా ఉండాలి.