బీజేపీపాలిత గుజరాత్లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పాలన్పుర్-అంబాజీని కలిపేందుకు వారం క్రితమే 6 కాంక్రీటు స్లాబులు నిర్మించారు. స్లాబులు కొత్తగా వేయడంతో ఈ ఘటన జరిగినట్టు కలెక్టర్ వరుణ్‌కుమార్ తెలిపారు. గుజరాత్లో రెండు నెలలకోసారి బ్రిడ్జిలు కూలుతున్నాయని ప్రభుత్వం పరిస్థితులపై స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.