శీతాకాలంలో వాతావరణ ప్రభావం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. ఈ క్రమంలో జలుబు, దగ్గు, ఆస్తమా, శాస కోశ సమస్యలు వంటివి వేధిస్తాయి. ఈ నేపథ్యంలో రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోవడానికి ఏ కూరగాయలు తీసుకుంటే మంచిదో ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. సోరకాయ, కాకరకాయ, కంద, ముల్లంగి, క్యారెట్ లో పోషకాలు పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.