జుట్టు ఆరోగ్యం కోసం మందార పూలను ఉపయోగిస్తారని తెలుసు. జుట్టు కోసమే కాక, మందారంతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వుతో తయారు చేసిన టీ తాగడం వల్ల షుగర్, ఆందోళన, హైబీపీ తగ్గుతాయి. మైగ్రేన్, మొటిమలు, చిగుళ్ల సమస్యలు దూరం అవుతాయి. గ్లాస్ నీటిలో ఒక మందార పువ్వు, టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, గ్రాము శొంఠిపొడి వేసి అరగ్లాసు అయ్యే వరకు మరిగిస్తే మందార టీ తయారవుతుంది.