తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వలన తల్లికి ప్రసవానంతరం బరువు తగ్గుటకు దోహదపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి బాలింత దశలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి రాకుండా స్త్రీని కాపాడుతుంది. ఎంత ఎక్కువ కాలం తల్లి బిడ్డకు పాలు ఇస్తే అంత మంచిది. వ్యాధులు నుండి అంతే ఎక్కువ కాపాడుతుంది. ఆవు లేక గేదె పాలు తీసుకున్న పిల్లలు ఎక్కువ అలర్జీ సమస్యలకు గురి అవుతారంటున్నారు నిపుణులు.