1) మేషరాశి.... (అశ్విని, భరణి, కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
వారం ప్రారంభంలో వ్యవసాయ అంశాలు, విద్యార్థుల విద్య అంశాలలో శ్రద్ధ తీసుకుంటారు. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు, రుణములు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. నూతన గృహ, ఖరీదైన వాహన కొనుగోలు కొరకు ఆలోచనలు చేస్తారు. వాహనములు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా బాధ్యతలు అధికము, అలసట బడలిగా ఉంటాయి. వృత్తి సంబంధ అంశాలలో ఇతరుల సలహాలు, కొత్త వ్యక్తుల జోక్యం కొంత చికాకును కలిగిస్తుంది. వారం మధ్యలో శారీరక శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా కొంతవరకు మెరుగుపడుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, ఉపాసన బలాన్ని పెంచుకుంటారు. వారము చివరిలో ఇతరులతో ఘర్షణ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము పోటీలలో నెగ్గె ప్రయత్నాలు కొంత అశ్రద్ధ చేస్తారు. మంచి ఫలితముల కొరకు హనుమాన్ మందిరాల దర్శన మంచిది
2) వృషభరాశి...(కృతిక 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర 1,2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
వారం ప్రారంభంలో ధైర్యం పరాక్రమం పెరుగుతుంది స్నేహితులు సహకరిస్తారు నూతన వ్యక్తుల పరిచయాలు, దూర ప్రాంతాలలో ఉండే మిత్రుల, తోబుట్టువుల తో దీర్ఘకాలిక చర్చలు, సలహాలు కొత్త నిర్ణయాలు. కమ్యూనికేషన్ బాగుంటుంది , జర్నలిజం రంగంలో ఉండే వారికి అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తుల విషయాలలో, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో త్వరపడి నిర్ణయాలు తీసుకుని తద్వారా ఇబ్బందులకు గురి కాకుండా ముందు జాగ్రత్త తీసుకొని ముఖ్యులను సంప్రదించి ముందుకు వెళ్లడం అన్ని విధాల శ్రేయస్కరం .దూర ప్రదేశాలలో హాస్టల్లో వసతి కొరకు ప్రయత్నాలు చేయు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గృహ మార్పులకు, చిన్నపాటి రిపేరులకు అవకాశాలు. వ్యవసాయ సంబంధిత అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. స్వగ్రామ సందర్శన కొరకు ఆలోచనలు చేస్తారు. వారము చివరిలోపోటీ తత్వం పెరుగుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు.సంతానము అభివృద్ధి పరంగా ముందుకు వెళుతుంది, ఆధ్యాత్మికతపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆలోచనలు వికసిస్తాయి నూతన నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది గృహముపై ఆదాయము అందుకుంటారు. మంచి ఫలితాల కొరకు శివాలయ సందర్శనమేలు.
3) మిధున రాశి...(మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
ఎడబాటు, పౌరుషంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పెట్టుబడుల విషయాల్లో కొత్తవారిని త్వరపడి నమ్మి నిర్ణయానికి రాకూడదు. ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ వాటిని చాకచక్యంగా నియంత్రించుకోవాలి. వారం మధ్యలో ఇతరులకు సలహాలు ఇస్తారు. నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది కొత్త ఆలోచనలు చేస్తారు ప్రణాళికా పరంగా ముందుకు వెళతారు. సంతాన సహకారం బాగుంటుంది. విదేశీ ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. సమిష్టి సమావేశాలలో పాలుపంచుకుంటారు. వారం చివరిలో సంతానం అభివృద్ధి మీకు గౌరవాన్ని పెంచుతుంది. ఆలోచనలు వికసిస్తాయి. విద్యాపరంగా కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి , ఆదాయము ఆనందాన్నిస్తుంది. మంచి ఫలితముల కొరకు సాయిబాబా దేవాలయ సందర్శన మంచిది.
4) కర్కాటక రాశి...(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
వారం ప్రారంభంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, విద్యాపరమైన అభివృద్ధి విషయాలలో ముందుకు వెళతారు. మీరు ఉత్సాహంగా కొంత ఉద్వేగంగా ఉంటారు. సంతానమునకు విద్యాసంబంధమైన స్టేషనరీ మొదలైన ఖర్చుల కొరకు ధనాన్ని ఏర్పరచుకుంటారు. పరిచయము లేని కొత్త వ్యక్తులను నమ్మే విషయంలో ముందు జాగ్రత్త అవసరం. భాగస్వామి సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేయు ప్రయత్నాలు ముందుకు సాగుతాయిపెద్దలతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కొరకు చేయు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పోటీలలో విజయం సాధించడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయుల తోడ్పాటుతో అనుకున్న విషయాలలో విజయాన్ని సాధిస్తారు వారం మధ్యలో.ఇతరులకు వాగ్దానాలు చేసేటప్పుడు ఆలోచించి చేయడం మంచిది బంధువుల రాక కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది స్నేహితులు సహకరిస్తారు, ఆదాయమునకు మించిన ఖర్చు కొంచెం చికాకు కలిగించినప్పటికీ పనులు సులభంగా ముందుకు కదులుతాయి నిర్ణయాలు తీసుకుంటారు.వారము చివరిలో పరాక్రమం పెరుగుతుంది.వ్యాపార పరమైన ఆలోచనలు వికసిస్తాయి. రాజకీయ రంగంలోని వ్యక్తుల సహకారముతో వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునే దిశగా ఆలోచనలు సాగిస్తారుమంచి ఫలితముల కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన మంచిది
5) సింహరాశి...(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
వారం ప్రారంభం రుణములు చెల్లించటానికి చేయు ప్రయత్నాలు కొంతవరకు సత్ఫలితాలను ఇస్తాయి. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అధిక ఖర్చులతో ప్రారంభమైనప్పటికీ అవి సంతృప్తికరంగా సద్వినియోగ పడతాయి మీ సహకారం కోరుకున్న మిత్రులకు సమయానికి మీరు ఉపయోగకరంగా ఉంటారు. విదేశాలలో ఉన్న చిన్ననాటి స్నేహితులను ఫోన్ల ద్వారా పలుకరిస్తారు. వారం మధ్యలో జర్నలిజం మరియు కళా రంగంలో ఉండే వారికి కవులకు అనుకూలమైన సమయం. భాగస్వామి వృత్తి పరంగా నూతన అవకాశాలు, శారీరక శ్రద్ధ పెరగడం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు. వారము చివరిలో మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ఉద్వేగాలకులోను కాకుండా నిర్ణయాలు ప్రశాంతంగా తీసుకొనుట మంచిది. ఆర్థిక అంశాలపై దృష్టి సారిస్తారు. రావలసిన ఆదాయంలో చిన్నపాటి వాయిదా. కుటుంబ అంశాలలో తోబుట్టువులతో కలిసి కొత్త నిర్ణయాలు తీసుకోవడం సమావేశాల్లో పాల్గొనడం. మంచి ఫలితముల కొరకు దేవి ఆరాధన మంచిది.
6) కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4 పాదాలు, హస్త 4వ పాదం, చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో , పా, పి, పూ , షం , ణా, పే,పో)
వారం ప్రారంభం ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న ఒక వార్త సంతోషాన్నిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కొత్త ఆలోచనలు చేస్తారు.కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.విదేశాలలో గుర్తింపు గౌరవం లభిస్తుంది. దూరప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల సహకారముతో భాగస్వామికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది వృత్తిపరమైన అభివృద్ధి. వారం మధ్యలో ఆకస్మిక ఖర్చులు ప్రయాణాలు ఉన్నప్పటికీ కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వారము చివరిలోసాంఘిక సేవ చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో నూతన పరిచయాలు. భాగస్వామి ఆదాయపరంగా బావుంటుంది. భూ సంబంధ కొనుగోలు కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. తీసుకునే సమయస్ఫూర్తి నిర్ణయాలకి ఉన్నతాధికారంలో ఉండే వ్యక్తుల సహకారం తోడ్పడుతుంది. వ్యాపార రంగంలో ఉండే వారి సలహా సంప్రదింపులు ఉంటాయి. శ్రమ గుర్తింపు గౌరవం లభిస్తాయి. మంచి ఫలితములు కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది
7) తులారాశి...(చిత్త 3 4 పాదాలు, స్వాతి, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
వారం ప్రారంభంలో ఆగిన పనులు ముందుకు వెళతాయి. వృత్తిపరమైన నూతన అవకాశాలు. విదేశీ వ్యక్తుల నుంచి అనుకోని ఆహ్వానాలు. ఆకస్మికంగా ఆదాయం పెరుగుదల. భూ వాహన కొనుగోలు కొరకు నూతన ప్రయత్నాలు. వారం మధ్యలోసంతాన పరంగా ఒక గుర్తింపు ఆనందాన్ని కలిగిస్తుంది. పాత స్నేహితులని, ఆత్మీయులైన వ్యక్తులని కలుస్తారు. వారి సహకారంతో నూతన ప్రణాళికకి నాంది పలుకుతారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యము మెరుగు పడుతుంది. ఎదురుచూస్తున్న సమాచారాలు అందుకుంటారు, సంఘంలో రివార్డులు, అవార్డులు ఆనందాన్ని కలిగిస్తాయి. చాలా కాలంగా పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు గౌరవం కళా రంగంలో ఉండే వారికి నూతన అవకాశాలు. విదేశాలలో ఉండే వ్యక్తుల సహకారం బాగుంటుంది. వారాంతములో ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన రుణములను పొందుతారు. దగ్గర ప్రయాణాలు, అలసట బడలిక ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకున్న పనులు సాధించిన ఆనందంలో దాన్ని అధిగమిస్తారు. మంచి ఫలితముల కొరకు విగ్నేశ్వర పూజ మంచిది
8) వృశ్చిక రాశి...(విశాఖ 4వ పాదం, అనురాధ, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
వారం ప్రారంభంలోవిదేశాలలో ఉండే మిత్రుల సహకారంతో సంతాన వృత్తిపరమైన కొత్త నిర్ణయాలు. ఆధ్యాత్మికమైన ప్రయాణాలు దైవదర్శనాలు, ఆలయ సందర్శన.గృహ వాతావరణం కొంచెం ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ సమయస్ఫూర్తిగా మాట్లాడి సమస్యల్ని అధిగమిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఒకరితో ఒకరికి అపార్ధాలు రాకుండా కుటుంబసభ్యులు మధ్య సమన్వయం పాటించాలి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు. ఉన్నత విద్య కొరకు విద్యార్థులకు దూర ప్రాంతాలలో వ్యక్తుల సహకారం. నూతన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన అంశాల్లో శ్రద్ధ ముఖ్యము జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి. సమయానికి తగిన ఆహార స్వీకరణ, విశ్రాంతి అవసరము. వారము చివరిలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సమాచారాన్ని అందుకుంటారు. ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులధికంగా చేస్తారు. చిన్ననాటి మిత్రులని కలుసుకుంటారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. మంచి ఫలితాల కొరకు అయ్యప్ప స్వామిని ఆరాధించటమేలు.
9) ధను రాశి...(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
ఈ రాశి వారికి వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంపై శ్రద్ధ తీసు కోవాలి. అవసరమైతే అశ్రద్ధ చేయకుండా వైద్యులన్నీ సంప్రదించాలి. ముఖ్య పనులు, ప్రయాణాలు , రావలసిన ఆదాయము వాయిదా, అనుకోని విమర్శలకు అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ వీలైనంతవరకు కొత్త వ్యక్తులతో ఆచితూచి మాట్లాడడం మంచిది. వారం మధ్యలో ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులపై విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం. విదేశాలకు ప్రయత్నం చేయు విద్యార్థులకు కొంత అనుకూలం.ఆత్మీయులు సహకరిస్తారు, ఆగిన పనులు కొంత వరకు ముందుకు వెళతాయి కమ్యూనికేషన్, ధైర్యం నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఆధ్యాత్మికమైన ఉన్నత వ్యక్తులని దర్శిస్తారు.వారం చివరిలోవృత్తిపరమైన అభివృద్ధి, ఆదాయంలో పెరుగుదల కొత్త అవకాశాలు తల్లి ఆరోగ్యం మెరుగు. వ్యవసాయ అభివృద్ధి. నూతన విషయాలు తెలుసుకుంటారు. మంచి ఫలితాల కొరకు శ్రీకృష్ణ మందిరాల దర్శనం మంచిది
10) మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భో , జా , జి, ఖి,ఖు, ఖే, ఖో, గా, గి)
ప్రారంభంలో పోటీలలో విజయం సాధించే ప్రయత్నాలలో అధికంగా శ్రమ పడతారు. వృత్తిపరంగా విదేశీ వ్యక్తులతో సమావేశాలు చర్చలు. తోబుట్టువుల సహకారం ఆశిస్తారు. సాంఘికంగా సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులని కలుస్తారు. మనసు ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనూ సరైన నిర్ణయానికి రాలేక కొంత ఆలోచన మందగిస్తుంద. నూతన పరిచయాలతో వ్యాపార అంశాలపై దృష్టి సారిస్తారు. వారం మధ్యలో ముఖ్యమైన పనులలో కొంత ఆటంకాలు వాయిదాలు, ప్రయాణాలు. ఆరోగ్య విషయంలో కొంత చికాకులు. కృషికి తగిన ఫలితం లభించడం లేదని కొంత నిరాశ. రావలసిన ఆదాయము సమయానికి రాకపోవడం వల్ల ఇబ్బంది, అయినప్పటికీ నిలవధనములతో సాగిస్తారు. మాటల వల్ల అపార్థములు జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మీయులను సంప్రదించి ముందుకు వెళ్లడం మేలు. సంతానానికి సంబంధించిన విషయాలలో వారితో అభిప్రాయ భేదములు కలుగకుండా జాగ్రత్తపడాలి. వారాంతములో తండ్రిగారి ఆరోగ్యం బాగుంటుంది వారి ఆశీస్సులు తీసుకుంటారు ప్రయాణములు కొంత వరకు కలిసి వస్తాయి. విదేశీ విద్య కొరకు చేయి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని వ్యక్తుల సహకారంతో ముందుకు వెళతారు నిర్ణయాలు బాగుంటాయి.మంచి ఫలితాల కొరకు లక్ష్మీదేవి ఆరాధన మంచిది
11) కుంభ రాశి...(ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
వారం ప్రారంభంలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. పోటీలలో శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రుత్వంతో ఉన్న వ్యక్తులు మీకు ప్రస్తుతం మిత్రులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విదేశీ విద్య దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ వాతావరణ ఆహ్లాదకరంగా ఉంటుంది విందు విలాసాల్లో పాల్గొంటారు. సంతానమునకు అభివృద్ధి కరంగా ఉంటుంది విదేశీ అవకాశాలు ఆహ్వానాలు.చాలా కాలంగా వాయిదా పడుతున్న వస్తున్న విషయాలలో కొంచెం కదలిక. ఆరోగ్యం బాగుంటుంది భూమి సిరాస్తుల అంశాలలో అనుకూలంగా ఉంటుంది. రావలసిన రుణములు అంటుకుంటారు. వారం మధ్యలోపలుకుబడి కలిగిన వ్యక్తులతో సమావేశాలు చర్చలు, భాగస్వామి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సంఘాల్లో గౌరవం, సామాజిక, కళ రంగంలో ఉండే వారికి, భాగస్వామికి శ్రమకి తగిన ఫలితం, గుర్తింపు.వారం చివరిలో వాగ్దానములు నిలబెట్టు కొనుట కష్టం. సలహా కొరకు తల్లితండ్రులను సంప్రదిస్తారు.శ్రమ అలసట బడలిక, ప్రయాణాలు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము .పనులు తాత్కాలికంగా వాయిదా. మంచి ఫలితాల కొరకు విష్ణుమూర్తి ఆరాధన మంచిది.
12) మీన రాశి...(పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభంలోవిద్యార్థులు విద్యాపరమైన అంశాలలో దృష్టి సారించాలి. అనుకోని వ్యక్తుల కొరకు అనవసర ఖర్చులు, వారి అభివృద్ధి విషయం కొరకు ఎక్కువ సమయాని కేటాయిస్తారు. వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరము. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చేయు ప్రయత్నాలలో ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకొని తద్వారా ముందంజ వేయడం మంచిది. విజ్ఞానపరమైన నూతన విషయాల కొరకు సమయాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. విందులు వినోదాలు అధికంగా ఉంటాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవాలి. సంతానానికి సంబంధించిన విద్యాపరమైన ఖర్చులు, విదేశీ అవకాశాలు. దూర ప్రదేశాలలో ఉండే ఆత్మీయులు సహకరిస్తారు. వారం మధ్యలో శుభకార్యములకు, తోబుట్టువుల కొరకు ఖర్చులు అధికం. రుణములు చెల్లిస్తారు. వారం చివరిలో ముఖ్యమైన ప్రయాణాలు, ఆరోగ్యము, పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ప్రణాళికతో అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. కళారంగంలో ఉండే వారికి అభివృద్ధి కరంగా ఉంటుంది. సాంఘిక సమావేశాల్లో పాలుపంచుకుంటారు. సమాజంలో గుర్తింపు గౌరవం, విశ్రాంతి కొరకు రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళతారు. మంచి ఫలితముల కొరకు నవగ్రహ దేవాలయ సందర్శన మంచిది
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)