బ్లడ్ ప్రెషర్ రీడింగ్ 90/60 ఎంఎం హెచ్‌జీ కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీగా భావిస్తారు. అయితే మీకు లో బీపీ ఉందా? లేదా? తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. లో బీపీ వల్ల చర్మం చల్లగా, తేమగా ఉంటుంది. చేతులు, కాళ్లు తాకితే చాలా చల్లగా అనిపిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో లో బీపీ వల్ల మూర్ఛ సమస్య వస్తుంది. మెదడుకు తగినంత రక్తం లభించనప్పుడు తాత్కాలికంగా స్పృహ కోల్పోయేలా చేస్తుంది. శ్వాస కోశ సమస్య, అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.