దీపావళి పండుగకు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలోని గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గ్రూప్ సీ ఉద్యోగులకు రూ.7 వేల బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 80,000 మంది గ్రూప్ బి నాన్ గెజిటెడ్ మరియు గ్రూప్ సి ఉద్యోగులు ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. సీఎం తాజా ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.