తమలపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. దీని వల్ల గౌట్, మూత్ర పిండాల్లో రాళ్ల వంటి సమస్యలు అధికమవుతాయి. అయితే, ప్రతిరోజూ తమలపాకు తీసుకోవడం వల్ల ఈ సమస్య నివారించవచ్చని చెబుతున్నారు. అలాగే తమలపాకు నోటి దుర్వాసనను నియంత్రించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంటున్నారు. టైప్ 2 డయాబెటిస్ ను కూడా నివారిస్తుందని అంటున్నారు.