చలికాలంలో ఆకుకూరలు తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని, జీవక్రియ మెరుగుపడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైటోనూట్రియెంట్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. డైటింగ్ చేసే వారు తప్పనిసరిగా ఆకుకూరలు తినాలి. చామకూర, గోంగూర, పాలకూర, తోటకూర, మెంతికూర, మునగాకు వంటి ఆకుకూరలను ప్రతి రోజు తినాలి.