వెన్నునొప్పి ప్రమాదకరమైనది. అది మొదట్లో వెన్నుకి మాత్రమే వస్తుంది. దాన్ని తేలిగ్గా తీసుకుంటే క్రమంగా అది చేతులు, కాళ్లకు కూడా పాకేస్తుంది. ఎక్కువ సేపు డెస్కు దగ్గర కూర్చొని పనిచేసేవారికి ఇది వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ బరువులు మోసేవారికి కూడా ఈ సమస్య ఉంటుంది. ఎక్కువ టైమ్ డ్రైవింగ్ చేసినా పెయిన్ కామనే. ఇది రావడానికి ప్రధాన కారణం చాలా కండరాలు అలసిపోవడమే. సరైన ఎక్సర్‌సైజ్ చేయకపోతే వెన్నునొప్పి పెరుగుతూ ఉంటుంది. ఇది కణాజాలాన్ని నాశనం చేస్తుంది. కండరాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది వచ్చిన వారికి కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది. నిల్చున్నా, కూర్చున్నా ఏ పని చేద్దామన్నా ఆ నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది.
బ్యాక్ పెయిన్లలో చాలా వరకూ మనం తీసుకునే ప్రత్యేక చర్యలతో తగ్గిపోతాయి. ఐతే విశ్రాంతి తీసుకున్నా ఈ నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ని కలవడం మేలు. అలాగే వెన్ను నుంచి ఈ నొప్పి కాళ్లు, మోకాళ్ల కింద కూడా వస్తూ ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి. నీరసంగా అయిపోతున్నా, బద్దకంగా అనిపిస్తున్నా కాళ్లలో తిమ్మిరిలా వస్తున్నా డాక్టర్‌ను కలవాలి. చాలా మందికి బ్యాక్ పెయిన్ పెరిగినప్పుడు జ్వరం కూడా వస్తుంది. విపరీతంగా బరువు తగ్గిపోతారు. పని ప్రదేశంలో నిఠారుగా కూర్చోండి. అలాగే నిల్చున్నప్పుడు కూడా పక్కకి వంగకండి. నిఠారుగా కూర్చోవడం వల్ల వెన్నెపూసపై భారం తగ్గుతుంది. తద్వారా బ్యాక్ పెయిన్ పెద్దగా రాదు.