మూడు పూటలు వైట్ రైస్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార వనరులతో వైట్ రైస్ ఒకటి. వైట్ రైస్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. ఇతర ధాన్యాలతో పోలిస్తే వైట్ రైస్‌లో తక్కువ పోషకాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో పోషకాలు అందక.. ఎముకలు, దంతాల క్షీణత, పలు రకాల సమస్యలకు దారి తీస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనపరుస్తుంది.