అనేక వ్యాధులకు అల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్లం జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది, కడుపుని వేగంగా ఖాళీ చేస్తుంది. అజీర్ణం, అల్సర్ మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి అల్లం మేలు చేస్తుంది. రక్తాన్ని పలుచగా చేయడంతోపాటు, అల్లం గుండెపోటు, స్ట్రోక్స్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రమాద సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.