ఏఐ ఆధారిత చాట్‌జీపీటీని రూపొందించిన శామ్ ఆల్ట్‌మన్‌ను సీఈవోగా తొలగిస్తూ ఓపెన్ఏఐ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు చర్చల్లో అతడు నిజాయితీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడుతున్నాడని, ఆయన నాయకత్వంపై నమ్మకం లేకపోవడమే కారణమని కంపెనీ తెలిపింది. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ సీఈవోగా వ్యవహరిస్తారని సంస్థ ప్రకటించింది.