బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్ తీరంలో భేపుపరాకు సమీపంలో తీరం దాటిందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొంది. అయితే దీని ప్రభావం ఏపీపై ఉండదని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో, దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని చెప్పింది. దీంతో ఏపీలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.