లవంగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లవంగం కాలేయం ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. హెపటైటిస్ సమస్య ఉన్నవారికి, కొత్త కణాల పెరుగుదలకు ఇది బాగా తోడ్పడుతుంది. ఖాళీ కడుపుతో చిటికెడు లవంగాల పొడిని తీసుకుంటే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. వికారం వంటి సమస్యలున్నవారు లవంగం తీసుకుంటే ఉపశమనం పొందొచ్చు. ఉదయాన్నే లవంగాలు తీసుకుంటే దంతాల నొప్పి, నోటి దుర్వాసన వంటివి ఉండవు.