మేషం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
వృషభం: స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది.
మిధునం: చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కర్కాటకం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.
సింహం: సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటాబయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కన్య: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయట పడగలుగుతారు. దూరపు బంధువులను కలుసుకుని వివాహ విషయమై చర్చ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
తుల: ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికం: శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
ధనస్సు: బంధు మిత్రులతో గృహమున మరింత ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
మకరం: వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.
కుంభం: ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తివ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాల సంతృప్తినిస్తాయి.
మీనం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.