ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలిపోవడంతో 30 కోట్ల మేరకు ఆస్తి నష్టం కలిగిందని సమాచారం. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కార్పొరేటర్ కందుల నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు ఆరా తీసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.