అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 244 పాయింట్ల లాభంతో 65,899 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 19,770 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో సన్‌ఫార్మా, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, విప్రో, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.