కిడ్నీస్ శరీరానికి వెనుక భాగాన, వెన్నెముకకిరువైపులా రెండు ఉంటాయి. శరీరంలో ఉన్న విష పదార్ధాలను తొలగించటం వాటి ముఖ్య విధి. కేవలం రక్తంలోని మలినాలను తొలగించటమే కాక శరీరంలోని నీటి ఉత్పాదనను నియంత్రిస్తాయి, ఇంకా ఎర్ర రక్త కణాల ఉత్పాదనలోనూ తమ వంతు సాయం చేస్తాయి. మన శరీరంలో పేరుకుపోయి చెడు పదార్ధాలను రోజూ బయటకు పంపెయ్యాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడవుతాయి. మరి అలాంటి కిడ్నీలను మనం చాలా ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి కదా. దానికోసం ఇలా చెయ్యండి.
కొత్తిమీరను కానీ, కరివేపాకును కానీ తీసుకుని (మీకు అందుబాటులో ఏదుంటే అది) సన్నగా తరిగి నీటితో కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో కొత్తిమీర లేదా కరివేపాకు తరుగు వేసి ఇంకాస్త మరిగించాలి. కొంచెం సేపయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని వాడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత అందులో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. ఇలా తరచూ చేస్తుంటే కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పోయి శుభ్రంగా మారుతాయి.