మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ కొత్తగా వాయిస్ చాట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది గ్రూప్ కాల్స్ చేసే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాయిస్ కాలింగ్‌తో పోలిస్తే ఈ ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా వాట్సాప్ వాయిస్ చాట్ ఎలా పని చేస్తుంది. దీని వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం
వాట్సాప్‌లోని ఈ కొత్త ఫీచర్ యూజర్స్ ఎక్స్‌పీరియన్‌ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్‌లో ఉండే ఎక్కువ మంది గ్రూపుల కోసం గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ఉంచింది. కానీ వాయిస్ చాట్ ఫీచర్ రాకతో వాట్సాప్ లాగే కమ్యూనికేషన్ కూడా సులువుగా మారనుంది. ఇంతవరకు గ్రూప్ కాల్స్ సమయంలో వాట్సాప్ యూజర్లకు కేవలం రింగ్ మాత్రమే వినిపించేది. వాట్సాప్‌లో గ్రూప్ కాల్ చేసినప్పుడు.. తదతర గ్రూపుల్లో ఉండే సభ్యులందరికీ రింగ్‌తో పాటు అవ్వాలంని నోటిఫికేషన్ వస్తుంది. ఏదైనా అత్యవసరమైన పనుల్లో ఉన్నప్పుడు ఇలాంటి గ్రూప్ కాల్స్ వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ వాయిస్ చాట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది.