సంస్థలకు డిజిటలైజేషన్ పరిష్కారాలను అందించే UST, హైదరాబాద్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని యూఎస్టీ సీఈవో కృష్ణ సుధీంద్రతో కలిసి తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ బుధవారం ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ కేంద్రంలో 2 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారని, వచ్చే మూడేళ్లలో మరో 2 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది.