చలికాలంలో సాధారణంగా గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కలించడం వల్ల గొంతు వాపు తగ్గుతాయి. నల్ల మిరియాలు, పొడవాటి మిరియాలు, అల్లం మిశ్రమంతో చేసే త్రికటు తీసుకుంటే కఫ, వాత దోషాలు సమతుల్యం అవుతాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి పడుకునే ముందు తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.