మేషం: నూతన పనులను ప్రారంభిస్తారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కీలక వ్యవహారాలు చర్చించి మీ విలువను మరింత పెంచుకుంటారు.
వృషభం: కొన్ని వ్యవహారాలలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.
మిథునం: సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు కలసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం: దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. స్థిరాస్తి వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.
సింహం: కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
కన్య: దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. నూతన రుణ యత్నాలు చిన్నపాటి ప్రయత్నం మీద పూర్తిఅవుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.
తుల: సమాజంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికీ విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.
వృశ్చికం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.
ధనస్సు: సంతాన సంబంధిత ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు స్వల్ప సమస్యలు తప్పవు.
మకరం: చేపట్టిన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
కుంభం: నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సలహాతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
మీనం: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.