మరోసారి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. తాజాగా ఒడిశాలో రూర్కెలా-భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లు విసిరారు.
ఆదివారం ఒడిశాలో రూర్కెలా-భువనేశ్వర్ (20835) రైలును లక్ష్యంగా చేసుకుని దుండగులు రాళ్ల దాడి చేయగా రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో రైలు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ కిటికీలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.