గుండెపోటుతో మరో చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన తాజాగా ఢిల్లీలో జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన విహాన్ జైన్ అనే ఆరేళ్ల బాలుడు పెళ్లి వేడుక కోసం తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీ వెళ్లాడు.
ఈ క్రమంలో అక్కడ అస్వస్థతకు గురికాగా చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న విహాన్ మయోకార్డిటిస్(గుండె కండరాల వాపు) వల్ల చనిపోయాడని వైద్యులు తెలిపారు.