పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) 80 గ్రూప్-బి, సి, టెక్నికల్ నాన్-మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ ఉండదు. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 10 కాగా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 16, 17 తేదీల్లో జరుగుతుంది. పూర్తి వివరాలకు https://niv.recruitlive.in/ వెబ్ సైట్ చూడండి.