బొప్పాయిని రోజులో ఎప్పుడైనా తినవచ్చు. పండిన బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే ఎక్కువ మేలు చేస్తుంది.. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.. ఉదయాన్నే తీసుకుంటే అనేక సమస్యలకు చెక్.. కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కివిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. అరటిపండులో పొటాషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అరటిపండ్లు త్వరగా జీర్ణమై.. నీరసం లేకుండా తక్షణ శక్తిని ఇస్తాయి.. చలికాలంలో ఆరెంజ్ పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. ఇందులో విటమిన్ సి మరియు ఫైబర్ ఉంటుంది.. దానిమ్మ కూడా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.. ముందుగా ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల మంచినీళ్లు తాగితే బరువు తగ్గుతారు.. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది..