జామ కాయలో ఎన్నో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఏ, సీ, ఫైబర్ అధిక మోతాదులో లభిస్తాయి. నారింజ కంటే జామలోనే విటమిన్-సి అధికంగా ఉంటుంది. పేగులను శుభ్రపరిచే పెక్టిన్ జామలో లభిస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగపర్చి, మలబద్ధకాన్ని పోగొడుతుంది. చర్మ సంరక్షణకు అవసరమై కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మధుమేహ రోగులు వీటిని తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.