మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అందుకు ఉదాహరణే వేప. దీంతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎర్రగా మారిన చర్మాన్ని నయం చేయడానికి వేప చక్కగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యలు, జుట్టు సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది. దురదలు, మంటలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి వేపాకు పేస్ట్ రాసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. అలాగే ముడతలు, మొటిమలను నయం చేయడానికి సహాయపడుతుంది.
వేప తో జీర్ణ వ్యవస్థ సాఫీగా జరుగుతుంది. వేపాకులను బెండపెట్టి పొడిగా చేసుకుని ఒక స్పూన్ వేప పౌడర్ లో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా శరీరంలో ప్రవేశించి హానికమైన వ్యాధులని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. మధుమేహం ఉన్నవారికి వేపాకు పొడి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం , సాయంత్రం భోజనానికి ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వేప పొడి వేసుకుని తాగితే ఎటువంటి సమస్యలు ఎదురవ్వవు.
అలాగే గజ్జి, తామర, దురద, ఎలర్జీ వంటి చర్మ సమస్యలను పోగొట్టడంలో వేపాకు ఎంతో ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు. అందుకే వేపాకు పుల్లలతో పూర్వకాలంలో బ్రష్ చేసేవారు. ఇలా చేయడం వల్ల దంతాలకు కూడా ఎటువంటి సమస్య రాకుండా దృఢంగా ఉంటాయి. అందువల్ల వేపాకు పొడిని కానీ, స్నానం చేసేటప్పుడు నీళ్లలో వేసుకుని చేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవు.