తులసి గింజల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ గింజల్లోని యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు జలుబు, దగ్గు చికిత్సకు సహాయపడతాయి. తులసి గింజలు, తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి గింజల్లో ఉండే ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లను రసాలు లేదా సలాడ్‌లతో కలిపి తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో తినాలనే కోరికను నియంత్రించుకోవచ్చు. తద్వారా శరీరం బరువును తగ్గించుకోవచ్చు. తులసి గింజలు రక్తపోటు, చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకారిగా ఉంటాయి.
తులసి గింజలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. జీర్ణ సమస్యలను పోగొడతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తులసి గింజలు మహిళల్లో అండోత్సర్గం, సంతానోత్పత్తికి సాయపడతాయి. ముఖంపై మొటిమలు పోయేలా చేస్తాయి. చర్మంపై బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయి.