రక్తదానం చేసే కొన్ని వారాల ముందు సీఫుడ్, మాంసం, బచ్చలికూర, బీన్స్ వంటివి తీసుకుంటే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు తగ్గకుండా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే రక్తదానం చేసిన తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలంటున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని, ధూమపానం, మద్యపానం వద్దని పేర్కొన్నారు. రక్తదానం చేసిన 24 గంటల్లో ఎలాంటి శారీరక శ్రమ చేయకూడదని చెబుతున్నారు.