మేషం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
వృషభం: చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఉన్నది.
మిథునం: బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.
కర్కాటకం: వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కీలక సమయంలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.
సింహం: వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది.
కన్య: కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషానిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.
తుల: వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.
వృశ్చికం: ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.
ధనస్సు: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
మకరం: వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు.
కుంభం: వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దాని పరంగా ఇబ్బందులు తప్పవు.
మీనం: దూరపు బంధువుల ఆగమనం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.