శీతాకాలంలో కీళ్ల నొప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం చలి కారణంగా కీళ్లు బిగుసుకుపోతాయి. వాతావరణాల్లో గాలి ఒత్తిడి మార్పులు కీళ్ల నొప్పులను ట్రిగ్గర్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో కొన్ని యోగాసనాలు ప్రాక్టిస్ చేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అధోముఖ స్వనాసనం, సేతు బంధాసనం, బాలాసనం, హస్త ఉత్తనాసనంతో మంచి ఫలితాలు కనిపిస్తాయి.