జామ ఆకులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణలు తెలిపారు. జామ ఆకులతో చేసిన టీ తాగితే బరువు తగ్గొచ్చు. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జామ ఆకులతో జుట్టు రాలే సమస్యను పోగొట్టుకోవచ్చు. గుప్పెడు జామ ఆకుల్ని నీళ్లలో 20 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి ఆ నీళ్లలో గోరింటాకు, మందారాకు ముద్దను కాసేపు నాననివ్వాలి. దీన్ని తలకు రాసుకొని, కొంతసేపయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలే సమస్య పోతుంది.