చాలా పదార్థాలని నూనెలో ఫ్రై చేస్తూ ఉంటాం. మిగిలిపోయిన ఆ నూనెని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. అందులో కొద్దిగా నీరు కలిపి బజ్జీ పిండిలా చేయాలి. దీనిని మరిగే నూనెలో వేయాలి. అప్పుడు అది నూనె అడుగు భాగంలోకి వెళ్ళి పిండి తాలుకూ అవశేషాలను అతుక్కునేలా చేస్తాయి. దీంతో ఈజీగా వాటిని బయటికి తీసేస్తే పదార్థాల తాలుకూ మొత్తం అవశేషాలు వచ్చేసి నూనె క్లీన్ అవుతుంది.