కొత్తచెరువు మండల కేంద్రంలోని మైలసముద్రం పంచాయతీలో వైసిపికి చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. బుధవారం రాత్రి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ లక్ష్మీదేవి, నారాయణ, మోహన్, నరసింహులు, రమణమ్మ, పెద్దన్న తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి నియోజకవర్గ సమన్వయకర్త పల్లె రఘునాథ్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.