నిల్చొని తినటం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. లక్నోలోని కల్యాణ్‌సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన రేడియోథెరపీ విభాగాధిపతి రాకేశ్‌కపూర్ ఆధ్వర్యంలోని బృందం నిల్చొని తినటం వల్ల కలిగే అనర్థాలపై పరిశోధనలు చేసింది. నిల్చొని తిన్నా, నీళ్లు తాగినా అన్నవాహిక కండరాల పనితీరుకు అడ్డు తగిలి జీర్ణక్రియ పనితీరుపై ప్రభావం పడుతుందని వివరించారు.