‘మాచా’ టీ. దీనిని ఎక్కువగా జపనీస్ తాగుతూ ఉంటారు. ఈ టీ తాగితే శరీరంలోని టెన్షన్ తగ్గుతుందట. మాచీ ఆకుల పొడిని అనేక రకాల మందుల తయారీలో వాడుతారు. అయితే దీంట్లో టెన్షన్ తగ్గించే గుణం ఉందని జపాన్‌లోని కుమార్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఒత్తిడి బాగా తగ్గి యాక్టివ్ అవుతారట. అంతేకాదు ఇది శరీరంలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఈ టీ తాగడం వల్ల ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటారట.