కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో 6మంది అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 2. 25లక్షలు నగదు, 5సెల్ ఫోన్లు, 4ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. రూరల్ పరిధిలో ఎక్కడైనా పేకాట, మట్కా ఆడుతున్నట్లు మీకు తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని రూరల్ పోలీసులు తెలిపారు.