యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 29న లెక్కించనున్నట్లు మంగళవారం ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీలు లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.